Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజాము రాజైతేనేమి ఖద్దరుపంచెల లీడరైతేనేమి
అన్యాయం ఎవడు జేసినా
నిలదీసిన ధీరత్వం.......
ప్రాంతీయుడైతేనేమి ప్రాంతేతరుడైతేనేమీ
దోపిడీ ఎవడు జేసినా
పాతరేసిన వ్యక్తిత్వం....
అసమానతని ఆధిపత్యాన్ని నిరసించిన గళమై
ప్రతిఘటనే జీవితమై ఉద్యమాలు ఊపిరై
కలాన్ని అంకుశం జేసి అక్షరం ఆయుధం జేసి
'అవనిపై జరిగేటి అవకతవకల' సరిజేసిన
మూర్తిమత్వం...
మన కాళోజీ -
తెలంగాణ నుడికారానికి కొత్త సొబగులు అద్దినవాడు
సామాన్యుని ఆవేదన ఆగ్రహం 'నా గొడవంటూ'
తెలిపి అజారామరుడైనాడు
పద్మవిభూషణుడైనా ప్రజలగుండెల్లో 'ప్రజాకవి'యై
నిలిచినాడు...
- అశోక్ గుంటుక
(సెల్ నం. 9908144099)
చిరునామా :- ఇంటి నం.1-4-335/2/A1
వేంపేట్ రోడ్, అక్షర హైస్కూల్ దగ్గర,
మెట్ పల్లి - 505325 జిల్లా:- జగిత్యాల