Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తన మాతృభాష తెలుగు కాకున్న నూ
అన్యభాషల తో పాటు
మాతృభాష నూ నేర్చుకుని
అచ్చ తెలుగులో పదాలను కూర్చిన
తెలుగు వాగ్మయకారుడు కాళోజీ!
పుట్టింది మహారాష్ట్రలో
పెరిగింది వరంగల్ లో
ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి
కర్త, కర్మ, క్రియ అన్నీ తానై
జనంలో చైతన్యదీప్తి రగిలించే
రచనలు గావించి
తెలంగాణా సాధనోధ్యమానికి
శ్రీకారం చుట్టిన ఉద్యమకర్త కాళోజీ!
ప్రజల గొడవ తన గోడవగా భావించి
సమస్యల పరిష్కర దిశగా రచనలు గావించి
ప్రఖ్యాత రచనలతో
పద్మభూషణ్ బిరుదును
సొంతం చేసుకున్న రెండవ భారతీయుడు
మన కాళోజీ!
కాళోజీ తెలుగువాడు కావడం
తెలుగువారందరి అదృష్టం!
తెలుగును ఇంటిభాషగా వాడుతూ
తెలుగులో వ్రాస్తూ
తెలుగులోనే సంభాషిస్తూ
తెలుగువేలుగుకు కృషి చేద్దాం
కాళోజికి నిజమైన నివాళి అర్పిద్దాం!
-ఆళ్ల నాగేశ్వరరావు
నాజారుపేట, తెనాలి,గుంటూరు జిల్లా
సెల్ నెంబర్.7416638823