Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీ కోసం నువ్వు ఏనాడు జీవించ లేదే
బాధాతప్త హృదయులకే నీ మది అంకితం
కలాన్ని విదిలించాలన్నా గళాన్ని గర్జింపచేయాలన్నా
పీడిత జనాలే నీ ముందు కదిలే వారే
నీ తెగువ నీ ధైర్యం యువతరానికి తిరుగులేని స్ఫూర్తి
నా గొడవ నాదేనన్నా
దేశం కోసమే జీవితమన్న నీకన్నా దేశభక్తుడు ఇంకెవరుంటారు
హక్కుల కోసం నీ ఆరాటం కారాగారంలో సైతం నీ పోరాటం
జగతికి నువ్వో చైతన్య కిరణానివి
సాహిత్యానికే వెలకట్టలేని ఆణిముత్యానివి
తెలంగాణాకే ముద్దుబిడ్డవి అగ్ని కణిక వి
రాజీ పడని కాళోజీ గా నువ్వే మా ఆదర్శం
- యలమర్తి అనూరాధ
హైదరాబాద్
9247260206