Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పువ్వు పుట్టగానే పరిమళించినట్లు
పరిమళించింది పిన్న వయసున మీ పోరాట పటిమ
నిజాంకు వ్యతిరేక పోరాటం
పొల్లగాడికి తుట్టి కాకుండా చేయనారాటం
నా గొడవ తో ప్రారంభమైన ఈ గొడవ
పుట్టుక నీదిౌచావు నీది
బ్రతుకంతా దేశానిదేౌఅని చెప్పి
తెలంగాణ యాస బాస మీ శ్వాసగా
ప్రజా కవిగాౌప్రజల మనిషిగాౌ
తుది విజయం అనేది నిజం
తుదకు ఫలించింది మీ ఆరాటం
వాడుక భాష నే బాటలు వేస్తుందనీ
వాడుకనే వేడుక చేశారు మన కాళోజీ!!
- కాళంగి.వసంత జెస్సన్
ఖమ్మం
చరవాణి:9490967433