Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనది నిత్యం సాహితీ సేద్యం..
నిరంతర.. సాహితీ సేవకులం..
ఓ సుదీర్గా.. పరిశోధకులం..
నిలువెత్తు సాహితీ పిపాసకులం..
విరిసిన యెద పరిమళాలను
ఆవిష్కరిస్తాం
ఎదురుగా నిలిచిన
అక్షరాలను జత కడుతాం
ఎవరికి కనిపించని నిజాన్ని
కళ్ళముందు ఆవిష్కరిస్తాం
నిజాన్ని చూసి తట్టుకోలేని వారు
కవితలకు కలతలను పుట్టిస్తారు
ఇప్పుడు అంతా
రాబందుల నిబంధనాలే..!!
కొందరు నయ వంచకుల
నల్ల ముసుగును తొలిగించే
శక్తి కవితకు ఉంది..
అందుకే నిశ్శబ్దాన్ని చీల్చి
నిజాని నిగ్గుతేల్చే కలాలను
కళ్ళు తెరిపిద్దాం..!!
చీకటి పొరలను తొలిగించి
మనసు తలుపులను తెరిపిద్దాం..!!
ప్రాణాల్ని మానాల్ని
మానవత్వాన్ని
అభిమానాల్ని కాపాడుతాయి..
మనిషిని బంధించిన
చిక్కులన్ని తొలిగించే కలాలు
కలం పోటుతో వెన్ను పోటు
దారుల నడ్డీఇరగ కొడుతుంది
నిర్మలంగా ఉంటూ
నిజ జీవితంలోని బతుకులను
బయటికి లాగుతుంది
ఆకాశ వీధిలో వెలుగే
ఓ ద్రువతారా కవిత్వం
విశ్వమంత తిరిగే
ఓ విశ్వ సుందరి కవిత్వం...
కాలం వెంట పరిగెత్తే కలం
కలం వెంట పరిగెత్తే కవి
అక్షరాలతో బంధిస్తుంది
అక్షరమే ఆయుధమై లేస్తుంది
గుండెలదిరేలా గర్జిస్తోందీ
ఉద్యమమై నడిపిస్తోంది
కవి వడిసెల్లో అక్షరాళ్ళుపెట్టి
విసురుతాడు
కవి చేతిలో కలం ఓ అగ్నికణం
ఓ చైతన్యజ్వాల
కదిలే పదాలతో
రగిలే భావాలకు పురుడు పోస్తాడు
కవిత్వంతో అల్లుకుంటాడు
కవి ఎప్పుడు అల్ప సంతోషి
కవి ఎప్పుడు ఆలోచనపరుడు
కవిని గౌరవిస్తే అక్షరాలతో
ఆశీర్వదిస్తాడు
అందుకే కవి ఓ అంతర్యామి
ఓ మానవతావాది..!!
అంబటి నారాయణ
నిర్మల్
9849326801
8-9-2020