Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ నుండి
వరంగల్లు జిల్లా మడికొండ కు తరలివచ్చిన
శ్రీ కాళోజీ రంగారావు, శ్రీమతి రమాబాయమ్మ ఆదర్శ దంపతుల
పుణ్య ఫలం మన కాళోజీ నారాయణరావు
పువ్వు పుట్టగనే పరిమళించును అనెడి సూక్తికి సాక్ష్యం వీరి జీవితం
అందుకు వీరి అభ్యుదయ భావాలే కాక, బహూ భాషలలో
అపారమైన పాండిత్య పటిమకు నిదర్శనమైన విబుధ వరుడు
నాటి పాలకుల అన్యాయానికి తన రచన అయిన ' నా గొడవ' తో
ఆరాజకీయ నాయకుల అన్యాయాల, దౌర్జన్యాల పై
ధైర్యంగా కవితా పరంగ సంధించిన అభినవ విజయుడు
నాడు నిజాం నిరంకుశత్వానికి,
అన్యాయానికి ఎదురు తిరిగిన ,
స్వాతంత్ర్యపు యోధుడు
తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం
ఇతని భావావేశపు రచనకు కవితా వస్తువులుగ చేసుకుని
తెలంగాణ ప్రజలచే 'ప్రజా కవి' అనే బిరుదు పొందిన మహనీయుడు
జీవనగీత, తెలంగాణ ఉద్యమ కవితలు మొదలైన రచనలునూ
వీరి కవితా ప్రతిభా శక్తికి చక్కని సాక్ష్యాలు
స్వరాజ్య సమరంలో పాల్గొన్న
ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులకు
కొండంత అండగ నిలిచిన ఆత్మీయ బంధువు
మాడపాటి హనుమంతరావుగారు, సురవరం ప్రతాపరెడ్డి
జమలా పురం కేశవరావు, బూర్గుల రామ కృష్ణా రావు, పి. వి. నరసింహారావు వంటి
ఆదర్శ నాయకుల విశేషాదరాభిమానాలకు సమ పాత్రుడు
అక్షరాస్యతకై, గ్రంథాలయాలకై
విశేష కృషి చేసిన కార్యాచరణ శీలుడు
' ఆంధ్ర సారస్వత పరిషత్తు'
స్థాపనలో పాలు పంచుకున్న కార్యదక్షుడు
అనేక పురస్కారములకు, విశిష్ట మైన 'పద్మ భూషణ్' అందుకున్న
ఓ అభ్యుదయ కవితా చక్రవర్తి అయిన ఓ మా కాళోజీ అందు కోవయ్యా
మా శతాభినందన పూర్వకకవితాక్షర కుసుమాంజలి
-గాడేపల్లి మల్లికార్జునుడు
S. A(తెలుగు)
ప్రకాష్ నగర్, నరసరావుపేట
సెల్ :9000749651
EMAIL : gmallikarjunudu@gmail.com