Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతని "ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక"...
అతని "గొడవ" ప్రజల గొడవ...
సామాన్యుడే ఆతని దేవుడు...
బ్రతుకంతా దేశానికై ధారపోసిన వైతాళికుడు...!
ప్రజాహక్కులకై సాంఘిక సమస్యలతో అక్షర యుద్ధం
చేసిన ప్రజాకవి...
వరంగల్ కోటలో జాతీయ
పతాక నెగురవేసి...
నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించిన స్వాతంత్ర్య సమర యోధుడు...!
"అన్య భాషలు నేర్చి, ఆంధ్రంబు నాదనుటకు సంకోచపడియెదవు...
సంగతేమిటిరా...చావవేటికిరా...!"
అంటూ చీవాట్లు పెట్టిన మాతృభాషాభిమాని...!
"అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి"
అంటూ జీవితాంతం
ప్రజల హక్కులకై పోరాడిన "పద్మవిభూషణుడు"...!
-చంద్రకళ. దీకొండ,
స్కూల్ అసిస్టెంట్,
మల్కాజిగిరి, మేడ్చల్ జిల్లా
మొబైల్ నెంబర్:-9381361384