Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గొంతెత్తి అడగవోయ్ సమాజపు అన్యాయాన్ని
కలమెత్తి రాయవోయ్ నీచపు ఆగడాలను
కదంతొక్కి నడవోయ్ చీకటిని చీల్చుతూ
ఎలుగెత్తి చాటవోయ్ బడుగు బలహీనులకి అండగా నేనున్నానని అంటూ..
సిరా చుక్కలనే వడిసెల రాళ్లుగా విసిరాడు..
కవనవు గీతాలతోనే నిజాంని నిక్కచ్చిగా ప్రశ్నించాడు..
వాక్యాల తూటాలతో గుండెల్లో గుబులు పుట్టించాడు..
బానిసత్వాన్ని మాపుటకు కదన రంగంలో దూకాడు..
తరగని,చెరగని సాహిత్యంతో సాన్నిహిత్యం చేసాడు
జనాల్లో చైతన్యాన్ని నింపాడు..
నిజాం ఆకృత్యాలని,రజాకార్ల ఆగడాలను ఎండగడుతూ
తన కలాన్ని గొంతుగా వినిపించి ఎన్నోసార్లు
కారగారాన్ని అనుభవించిన ప్రజా కవి కాళోజి..
నిజాం పాలన విముక్తి కై నిరంతరం శ్రమించిన కవి మహర్షి...
-మహేష్ వేల్పుల
తొండ, తిరుమలగిరి,
సూర్యాపేట
9951879504