Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బతుకంతా తెలంగాణ కోసమే
ఆరాటపడిండు
పోరాటం జేసిండు
గంపల కొద్ది పలుకుబళ్ళను బండ్లకెత్తి భవిష్యత్తు బజారులో కుప్పవోసి
తెలంగాణ ఇజాన్ని నిలబెట్టిండు
ఊపిరాడక ఊగిసలాడుతున్న
బాసకు శ్వాసనద్దిండు
తంగేడు పూలతో కమ్మని యాసై గుబాళించిండు
మన బాసకు తెగువుందని
మన మాటకు ఇలువుందని
నిరూపించిండు
కవితల దర్వాజ ముందు నిలబడి
తెలంగాణ ఆత్మగౌరవాన్ని
చాటి చెప్పిండు
ఈటెల్లాంటి మాటల మధ్యన
తూటాలా నిలబడ్డడు
రేపనేది ఉందా అని కుమిలే జాతికి
ఉద్యమాల ఊపునిచ్చిండు
నిదరవోయే మెదళ్ళలో
సిరాచుక్కల వెలుతురు వెదజల్లిండు
తెలంగాణ జాతికి అతడు పెద్దదిక్కు..
మన నేలలో మాండలికాల్ని పండించిన
కైతల రైతు..
అతడే...
కాళోజి నారాయణరావు
అచ్చమైన తెలంగాణ పదాల ప్రోవు..
--- తిరునగరి శరత్ చంద్ర
6309873682