Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రట్టిహళ్లిలో జన్మించిన రవికిరణం కాళోజీ...
పోరుగల్లుగా పేరోందిన ఓరుగల్లులోని మడికొండలో పేరిగేను మణిద్వీపమై...
మన బాస,యాసలకు మంచిరోజులు వచ్చేనని...
అన్య భాషలు వద్దు అమ్మ భాషే ముద్దు అని వివరించాడు...
తెలంగాణ తేజము,తొలిపోద్దు మన కాళోజీ...
ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక అని కవి హృదయాన్ని వివరించిన కల్మషం లేని ప్రజానేత......
గ్రామ గ్రామానికి గ్రంథాలయం ఉండాలన్నదే అతని ఆకాంక్ష..
మన గోడుని తన 'గోడవ' లో చెప్పిన మహానుభావుడు...
అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు-సకిలించు ఆంధ్రుడా అని తన గళంతో గట్టిగా విన్పించాడు...
దుష్టనీతి చేసే నిజాం నవాబుల పాలన కుట్రలను నిగ్గదీసి ఎదురించిన నిప్పుకణం...
చిన్నవయసులోనే రెండు సార్లు చెరసాలకు వెళ్లి ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన మంచి మనసున్న 'కలంనేత' ప్రజాకవిగా గుర్తింపు పోంది,పద్మవిభూషణ్ పురస్కారం పోందేను...
బహుకాలపు తెలుగోళ్ల బాధలు కష్టాలను తొలగించాడు...
నేడు అచ్చమైన యాస, బాస లతో కథలు పుస్తకాలు వచ్చుచుండెను దానికి కారణం కాళోజి....
తెలంగాణలో అవతరించెను,
వాకిట్లో హరివిల్లుల సందళ్లలాగా మన భాష.....
మిరుమిట్లు గొలుపుచుండేను మెలైన మెరుపులు..
నిత్యం సమాజ శ్రేయస్సుకై పరితపించిన మిమ్మల్ని
నేడు జయంతి అంటు జగతి 'నీ కలం' నిత్యం స్మరిస్తుంది....
-కోమ్ము.సాగరిక
మంచిర్యాల
8179364366