Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాళోజి ఎప్పుడు గుర్తుకొస్తడు
మనసులో మెదుల్తుంటడు
అసలు మరచిపోతే కదా
ఆయన గొడవని
కాళోజి ప్రజల మనిషి
మాటకి నడతకి తేడాలేని రుషి
ప్రజలకొరకు జీవించినాడు
ప్రజాబాటలో నడిచినాడు
రాజీపడని మనస్తత్వం
రాటుదేలిన ఉద్యమ నేపథ్యం
దండిగా ఉన్న మొండితనం
ప్రజా చైతన్యంలో అగ్రభాగం
మనసులో పసివాడి తత్వం
కవితకు మాత్రం సంపూర్ణత్వం
నడిచింది నిలిచింది ప్రజల పక్షం
నిరాడంబరత ఆయన జీవిత లక్ష్యం
అణగారిన వర్గాల పలవరించి
అవినీతి అసమానతల నిలువరించి
దోపిడి దౌర్జన్య శక్తుల ఎదురు నిలిచి
నిక్కమగు నీలములనందించిన నేటి వేమన
కలాన్ని ఖడ్గంగా మార్చి
నిజాన్నిఃయిజముఃగా కూర్చి
ఎమర్జెన్సీ కాలాన్ని సైతం చీల్చి
నా ఆలోచన నాదన్న మిర్చి
ఆయన నిర్భీతికి ప్రతీక
నిజానికొక మచ్చుతునక
అన్యాయానికి ధిక్కార స్వరం
ముక్కుసూటి మనస్తత్వం
కాళోజీది ప్రజల గొంతుక
వేదనామయ జీవితాల స్వరపేటిక
ఆయన మాటలు నిప్పురవ్వలు
ఆయన మనసు మల్లెపువ్వులు
బూర్గుల రామకృష్ణారావు అయితేనేం
పి.వి.నరసింహ రావు అయితేనేం
సామాన్య కూలి అయితేనేం
కాళోజీ వెదికేది మనిషినే
విశాలాంధ్ర కోరుకున్నవాడు
సంకుచితాంధ్రుల గుర్తించినవాడు
జరిగిన మోసం ఎరిగిఃనాడుః
తెలంగాణకై గళమెత్తినాడు
ఏడు దశాబ్దాల తెలంగాణ చరిత్ర
ఎందరో ఉద్యమకారుల త్యాగాల ఘనత
సాక్షిగా నిలిచిన మన కాళన్న
తెలంగాణీయులందరికీ పెద్దన్న
తెలంగాణ మదిలో మెదులుతుంటె
కాళోజియే గుర్తుకొస్తుండు
కాళోజీని యాది జేసుకుంటె
తెలంగాణ గుర్తుకొస్తుంది
-డా.వైరాగ్యం ప్రభాకర్, ఉపాధ్యాయులు
కరీంనగర్, 90145 59059