Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజాం నిరంకుశత్వాన్ని
కలంతో గళాన్ని ఎక్కుపెట్టిన
ఉద్యమకారుడు మన కాళోజీ !
బడి పలుకుల బాష
కాదు పలుకుబడుల బాష
కావాలన్న మాతృభాషా
ప్రేమికుడు మన కాళోజీ !
పుట్టుక నీది చావు నీది
బతుకంతా దేశానిది
అని ప్రజలకోసమే బతికిన
మానవతావాది మన కాళోజీ !
అన్యాయాన్ని, అరాచకాన్ని
ముక్తకంఠంతో నిలదీసి
తన నా గొడవ మన గొడవగా
చాటిన ప్రజాకవి మన కాళోజీ !
-పోటారు కుమార్
8978631913