Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాళీ జారిన సిరా చుక్కల
పదును దెలిపిన యోధుడు..
అక్షరాన్ని ఆయుధంగా
ఝళిపించిన ధీరుడు..
పదములతో కదం కలిపి
పోరు సలిపిన వీరుడు..
ధిక్కారమే ఝంకారమై
నినదించిన శూరుడు..
పొరుగు సోకు నెత్తికెక్కి
ఇంటి బాస ను ఈసడించ
తల్లి పలుకుల మధుర రుచుల
జాడ చూపిన జానపదుడు..
బడిపలుకుల భాష కన్నా
పలుకుబడుల యాస మేలని
ప్రజల బాష కు పబ్బతి బట్టి
జగతి చాటిన ప్రజాకవి..
జనులందరి గోడు
తన (నా)గొడవ గా పలికించి
సర్వహితమే తన మతమై
కలం దూసిన సంస్కర్త..
పుట్టుక, చావులు తాను భరించి
బతుకంతా మందికిచ్చి..
'తనువె'ల్లా జాతికొసగిన
కర్మయోగీ, త్యాగశీలి..
అస్తిత్వ పోరుకు అంకురమై
ముక్కోటి గొంతుల ముక్త స్వరమై
స్వరాష్ట్ర సాధన, సురాజ్య స్థాపన
స్వప్నించిన దార్శనికుడు..
చైతన్య దీప్తి
పోరాట స్ఫూర్తి
హృది నిండా ఆర్తి
ఎల్లలెరుగని కీర్తి..
జనత కోసమే రచించి
భవిత కోసమే యోచించి
జాతి హితమే కాంక్షించిన
మన జాతి కవి.. కాళోజి
మన జాతీయ కవి.. కాళోజి
-మధుర శ్రీ (మధుకర్ రావు బోగెళ్లి)
హన్మకొండ.
9491318502, 8522000157