Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవరీ కాళోజీ..?
నూనుగు మీసాల చిలిపి వయసులో
కన్నుగొట్టి పిల్లమనసు పట్టే బుర్రలో
విప్లవాన్ని ఊది
జైలును మచ్చిక చేసుకున్న
కార్చిచ్చు ఆ మనిషి
తన కైతల కవ్వంతో భాషను చిలికి
తెలంగాణ పలుకుబడులను
తౌరక్యాంధ్రమన్నోని నాలుక తెగ్గోసే కోసే
తేజైన కలానికి ఓనర్ ఆ మనిషి
గొడవలు తనకు కొత్తేం కాదు
తత్త్వం తనకు తెలవంది కాదు
తప్పొప్పుల మర్మం ఎన్నడో ఎరిగిన
నిఖార్సైన న్యాయవాది ఆ మనిషి
ప్రగతికి వంతెన కట్టిన
తన ఉక్కు కాయాన్ని కూడా
వైద్య ప్రగతికి రాసిచ్చిన
మహా మనీషి ఆ మనిషి
ప్రేమలో ఏకత్వమే ఉంటుందట
తను ఎదిగిన గడ్డను ప్రేమిస్తూ
ఈ నేల రేణువ్వులో
మమేకమైన ఆ కాళోజీయే
తెలంగాణా కాణాచి
- ఇనుగుర్తి లక్ష్మణాచారి
94410 02256