Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జనం బాటే మన బాటనీ
జనం భాషే మన భాష యనీ
యాస భాషలోనే ..
తెలుగు భాషకు వన్నెలద్దిన..
తెలంగాణ ముద్దుబిడ్డా...
కాళోజీ నారాయణుడా..
నీజయంతికివే..మాఅక్షరాంజలి
ఉధ్యమ నేతగా..
విప్లవ జ్యోతిగా..
నడిపించావు తెలంగాణ ఉద్యమాన్ని.
రగిలించావు నరనరాన విముక్తి వాదాన్ని.
తెలంగాణ యాస నీధ్యాసగా..
దాస్య విముక్తియే నీ శ్వాసగా..
నీ కలంతో కదిలించావు..!
నీ గళంతో గర్జించావు...!!
*పుట్టుక నీది-చావు నీది..
నడి మధ్య జీవితమంతా..
నిన్ను కన్న దేశానిది.* అంటూ
దేశ భక్తిని చాటిన ధీరుడవు.
నిజాం నిరంకుశత్వాన్ని ధిక్కరించి..
అన్యాయాలను,అక్రమాలను
ఎదిరించి..
జనం గొడవే *నా గొడవ* ని
నినదించి..
తెలంగాణ విముక్తి వాదమే
ఉధ్యమ ఊపిరిగా గడిపిన
మహనీయుడా...
కాళోజీ నారాయణుడా...
అందుకోండి మా అక్షర నీరాజనాలు..!!
- తాతోలు దుర్గాచారి
భద్రాచలం
9676357648