Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవరో..ఎవరెవరో
నాలోకి వస్తున్నారు!!
నన్ను కదిలిస్తున్నారు!!
కళ్ళుతెరిచేలోపే
కనిపించుకుండానే
వెళ్లిపోతున్నారు!!..
ఎందరెందరో నాముందు
నిలబడి తడుముతూ
నాలోని అణువణువునూ
స్పర్శించి వెళుచున్నారు..
కళ్ళుతెరిస్తే కనిపించరు!!..
ఏదో చెప్పాలని..
ఏదో చూపాలని..
సైగలతో సాహసిస్తున్నారు!!
ఎక్కడెక్కడో
వెతుకుతున్నారు!!..
అందమైన దూరాలనుంచి
ఏదో అందుకోవాలని
నా చుట్టూ
తిరుగుచున్నారు!!..
మనసుకు అగుపిస్తారు కానీ
కంటికి కనిపించరు!!..
ఓ కటిక చీకటిలో నిలబడి
ప్రతి లోపాలను..
నిజమైన రూపాలను
చూపిస్తూ..
అల్లంత దూరంలోనే
అందనంత ఎత్తులోకి
మాయమవుతారు!!...
ఇది కలతనిద్ర!!...
అన్నికలలే!!
నాలో జారిపోతున్నాయి..
ఏదో సాకారం ప్రక్రియ
జరుగుతున్నట్లు!!..
కలలోనుంచి బయటికి వచ్చినట్లు!!..
నీకు నాకు ఏదో...
సంబంధముందో..తెలువదు!!
కానీ ఏదో
మన మధ్య పరస్పర
అవగాహన ఉంది!!..
కొత్త వెలుగులతో
ఓ నిశ్చల
మౌన సముద్రుడై..
నిలబడి..
చిరునవ్వులతో
చూపులు విసిరి
వశం చేసుకున్నట్లు!!...
నరనరాలో కొత్త
ఉత్తేజం నింపినట్లు!!..
ఆప్యాయంగా
కౌగిలించుకున్నట్లు!!..
ఎప్పటికీ మరిచిపోని
అనుభూతి కలిగించి
కనబడకుండా వెళ్లిపోయారు...
గుండె చప్పుళ్లతో కళ్ళు తెరిచాను
అంత మాయ!!...
ఓ నిశ్శబ్దలోయ!!..
కలలో బలమైన దృశ్యాలెన్నెన్నో!!
మనసుకు మాత్రమే
కనిపించి
మాయమవుతాయి....
ఉలిక్కిపడిలేచి
ఓ పీడకలలా
దులిపేసుకోవడమే!!...
మళ్ళీ నిద్రలోకి
జారిపోవడమే!!....
జీవితమే ఓ కలల కళ...
కలలుకనాలి!!
సాకారం చేసుకోవాలి..!!
-అంబటి నారాయణ
నిర్మల్
9849326801