Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నింగిలో ఉన్న చుక్కలను లెక్కేయలేను
భూమి పొడవెంత అంటే కొలవలేను
నీ ఒడిని మించిన స్వర్గాన్ని వెతకలేను
నీ ముఖములోని బాధను చూడలేను
నీ చిరునవ్వును మించిన సంతోషం నాకు ఏది లేదు
నువ్వు లేకుండా నేనేమవుతానో ఉహించిలేను
నీపై నా ప్రేమ మాటల్లో వివరించలేను
నిన్ను మించిన దైవం నాకు ఏది లేదు
భూదేవియే తలవంచుతుందేమో
నీకున్న ఓపికను చూసి
ఆకాశమే అంతమైపోతుందేమో
నీ విశాల హృదయాన్ని చూసి
త్రిమూర్తులే కరములచే నమస్కరిస్తారేమో
కష్టాలను ఎదురించిన నీ ధైర్యం తీరును చూసి
గంగంమ్మ కంట నీరు పెడుతుందేమో
నువ్వు పడ్డ కష్టాలను చూసి
లక్ష్మీదేవియే ఈర్ష్య పడుతుందేమో
నీ అందమైన చిరునవ్వు చూసి
పుణ్యక్షేత్రాలు దర్శించితే పుణ్యమేమో
కాని నీ పాదాలను తాకితే చాలు
అమితమైన పుణ్యముతో
ఇక ఊపిరి కూడా అనందంగా వదిలేసి
స్వర్గ లోకంలో సంతోషంగా బతికేయచ్చు
ఆనాడు పరమ శివుడి కంఠంలో
విషం ఉందని అందరికి తెలిసింది
కాని నీలోని బాధలు
ఏనాడు, ఎప్పుడు ఎలానో ఎవరికి తెలియలేవు
గుండె నిండ బాధలు ఉన్నా
తీయని పలకరింపు మాత్రం
నీవెన్నడు మరువలేదు
నేను కష్టాలలో ఉన్నప్పుడు
నీ ముఖములో చిరునవ్వు
సంతోషమై ఎదురొచ్చింది ,
చీకటిలో భయపడుతుంటే
నీ కళ్లల్లోని తేజస్సు
వెన్నెలై వెలుగునిచ్చింది
చీకటనే భయాన్ని పారద్రోలించింది
ప్రశ్నలతోనే సతమతమైపోతుంటే
నీ మాటలే మెరిసే నక్షత్రంలా
త్వరగా ప్రశ్నలకు సమాధానమిచ్చింది
నీ వల్లనే నా జీవితానికో అర్థం
నీవు లేని నా జీవితం వ్యర్థం
నీతో ఉన్న ప్రతిక్షణం
నాకో సరికొత్త నందనవన వీక్షణం
-లడె. నిత్య.
ఐఐఐటీ బాసర