Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిత్యసాహితీ
చైతన్యమూర్తులం...
నిరంతరసాహితీ
పరిశోధకులం...
నిలువెత్తు
సాహితీస్ఫూర్తి
ప్రదాతలం...
విరిసిన యెద
పరిమళాన్ని ఆవిష్కరిస్తాం!!..
ఎదురుగా నిలిచిన
అక్షరాలను జత కడుతాం!!..
నిజాన్ని నిగ్గుదీసి
కళ్ళముందు ఆవిష్కరిస్తాం!!.
కొందరు నయవంచకులు
కప్పుకున్న నల్లముసుగును
తొలిగించే శక్తి కవితకు ఉంది..
అక్షరాలతో నిశ్శబ్దాన్ని చీల్చి
నిబద్ధతను నిగ్గుతేల్చి
కళ్ళు తెరిపిద్దాం!!..
చీకటితెరలను తొలగించి
మనసుతలుపులు తెరిపిద్దాం!!..
గగన వీధిలో వెలుగే
ఓ ద్రువతార..కవిత్వం!!
విశ్వమంత తిరిగే
విశ్వసుందరి...కవిత్వం!!
కాలం వెంట పరిగెత్తే కలం..
కలం వెంట పరిగెత్తే కవి..
అక్షరాలకే బందీ...
ఆ.. అక్షరమే
నేడు ఆయుధమై లేస్తుంది..
గుండెలదిరేలా గర్జిస్తుంది..
ఉద్యమమై నడిపిస్తుంది..
కవి వడిసెల్లో
అక్షరాళ్ళుపెట్టి
విసురుతుంటాడు...
కవిచేతిలో
కలం ఉన్నప్పుడు
కణకణమండే
ఓ అగ్నికణం...
గమనించి
అనుసరించండి...
కవిని గౌరవించండి!!...
కవిత్వంతోనే అందరినీ అల్లుకుపోతుంటాడు...
కవి ఎప్పుడూ
అల్పసంతోషి...
కవిని అగౌరపరిస్తే
అక్షరాలతోనే
అంతుచూస్తుంటాడు...
అందుకే కవి
ఓ..అంతర్యామి...
ఓ..మానవతావాది..!!
అంబటి నారాయణ
నిర్మల్
9849326801