Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పగల పొగలేనా!!??
రగిలే సెగలేనా!!??
మహర్షులు అందించిన
మమకారం మరిచారా!!??..
మహాత్ములు అందించిన
ప్రేమతత్వం విడిచారా!!??
క్రూరంగా తయారవుచున్నాం..
వికృతంగా ప్రవర్తిస్తున్నాం..
మాటల బాంబులతో
ఎదుటివారి మనసును
గాయ పరుస్తున్నాం
శాస్త్రాల పల్లకిని ఎత్తుకున్నోళ్ళం..
విజ్ఞాన అడుగులో నడుస్తున్నోళ్ళం...
అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నాం...
గగన విహారం చేసిన కాలం
చంద్రుని ఒడిలో ఆడుకున్నోళ్ళం...
అప్పుడే మరిచి పోయారా!!??
అంతర్గత కల్లోలాలను సృష్టించుకొని
అందరిలో కలహాలను పుట్టిస్తున్నాం...
ఉద్రేకాలను సృష్టించుకుంటున్నాం...
మనిషి చెక్కిన శిల్పాలకు
మనసు లేకుండా పూజిస్తున్నాం...
ఆధ్యాత్మికదారిలో నడుస్తాం..
అంధకారంగా ప్రవర్తిస్తున్నాం...
ఎదుటివారిని కళ్ళతో కాకుండా
ఒక్కసారి మనసుతో చూడండి!!
మనసు మనసు కలిసినప్పుడు
మమకారం పుట్టుకొస్తుంది..
అప్పుడైనా మనలో
మార్పురావచ్చు....
మన గుండెగూటిలో
నిగూఢంగా నింపుకున్న
కుళ్లును తొలిగించుకుందాం...
అనంతమైన విశ్వంలోని
ప్రేమను ఒంపుకుందాం...
రోజుకో పూటైన ఆత్మీయంగా
ఒకరికొకరం పలకరించుకుందాం!!...
అందరిలో
ప్రేమామృతాన్ని పంచుదాం!!....
ఇప్పుడు మనబతుకంతా
భయపెడుతూ..
భయపడుటమే సరిపోయింది...
మనిషితనాన్ని మింగేస్తున్న..
మనం చేసే పనులే
మనల్ని మనమే అగాధంలోకి
తోసేసుకుంటున్నాం...
గన్నుతో గుండెకు
గురిపెట్టు కుంటున్నాం..
పట్టపగ్గాలుల్లేని కోపతాపాలు
నిలువెల్లా నింపుకున్నాం..
కులం కుట్రలోంచి
మతం మత్తులోంచి
బయటపడుదాం!!..
దురహంకార తత్వాన్ని
వదులుకుందాం!!..
అందరికీ దగ్గరై మసలుకుందాం..!!
అంబటి నారాయణ
నిర్మల్
9849326801