Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొట్టండి డప్పు!!..
తెలుసుకోండి తప్పు!!..
ఎవరికి.. ఎవరో తెలియనిది..
తెలిసేలోపే.. జరిగే తప్పులు!!
ఎవరు చేస్తున్నారో?..
ఎవరు చేయిస్తునారో?..
తెలుసుకోండి...
డప్పులమోతకు
తప్పుల గుండెలు పగలాలి..
ఎన్నాళ్ళు ఈ తప్పులు?..
ఎన్నేళ్లు ఈ డప్పులు?..
నిజం దాచి అబద్దాలతో
అడ్డుకుంటున్నారు..
జగతి గతిని తప్పుదారి పట్టిస్తే
జగమంతా తప్పులమయమే!!..
డప్పుల మోతనే!!...
తప్పుచేసే వారిని వెదకండి!!..
ఎక్కడున్నా పట్టుకుందాం!!..
డప్పుకొట్టి చాటిద్దాం!!...
తప్పులన్నీ కుప్పబోసి నిప్పంటిద్దాం!!...
సమస్తాన్నీ మింగేసే తప్పులు..
అందరినీ కోల్పోయిన తిప్పలు..
పీడించే పీడితుల తప్పులు..
పాడె కట్టించే మనుషుల దప్పులు..
ఏమిటీ ఈ జడీ భూతం!!?..
ఎవరికీ అర్థంకాని మాయా బూటకం...
మోసంతో అమాయకుల
కడుపులు కొట్టి..తప్పులుచేసి
మీసం దువ్వేస్తున్నారు...
దళారుల తప్పుల దాగుడుమూతలు..
దోపిడీదారుల దొంగతనాలు..
లంచం కోసం వంచించే
మోసగాళ్ల తప్పులెన్నో
తమ తప్పులెరుగరు!!...
అందుకే డప్పులు మ్రోగిద్దాం!!...
దుమ్ము లేపేద్దాం..రండి!!..
ఇది ఉల్లాసంతో కొట్టే డప్పుకాదు!!..
ఆవేశంతో కొట్టేది...
తప్పు చేసిన వారి
గుండెలు అదరాలి...
చావుకు కొట్టే డప్పు కాదు
సంస్కరించే డప్పు
తప్పును ఏలెత్తి చూపే డప్పు
ఇది ఊరేగింపు డప్పు...
ఊరంతా వినాలి...
అందరిని మేల్కొల్పే డప్పు...
ఇది డప్పుల మోత..
తరతరాలనుంచి
జరుగుతున్న తప్పులే
బాధించి..బెదిరించి చేసే తప్పులే..
నీతిగా ఎదిగేవారిని
గోతిలో తోసే తప్పులు..
బతుకంతా తప్పులే..
ట్రిగ్గర్ నొక్కినట్లు...
గుండు దూసుకుపోయినట్లు...
తప్పులతో ఇతరుల
గుండెల్ని గాయపరుస్తున్నారు...
నిత్యం వేటాడే వేట గాళ్ళు
ఈ మాయ గాళ్ళు!!..
ఎక్కడో ఒకదగ్గర తప్పు చేస్తారు..
తప్పులో ఇరికిస్తాడు...
ఓ వ్యూహాత్మక ఆలోచన రూపంతో
అందరినీ పరిగెత్తిస్తారు..!!
అంబటి నారాయణ
నిర్మల్,
9849326801,