Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూమి మీద ఉన్న
నదులు..కుంటలు
చెరువులోనివి
అంతా జలమే!!...
ఎండిపోయిన
కళ్ళలో ఉన్న జలం మాత్రం..
ఎప్పటికీ ఇంకిపోనిది!!..
తడి ఆరనిది!!...
తడుముకుంటే
నిలువెల్లా తడిసిపోవడమే!!...
గాయపడ్డ గుండె
దుఃఖాన్ని స్రవిస్తుంది!!...
లోలోన ఉన్నతాపాన్ని
బయటి నెట్టేస్తుంది!!...
అదో కనిపించని జలసంద్రం!!..
ఇదొక ఊట చెలిమ!!..
సుఖంవచ్చినా..కష్టంవచ్చినా
పొంగుతుంది... వరదలా!!..
మనసులో నవ్వులు ఎక్కువైనా..
గుండెలో బాధలు ఎక్కువైనా..
కుండ బద్దలుకొట్టినట్లు
ఉబికి వస్తాయి కన్నీళ్లు!!...
అదో కన్నీటి సుడిగుండం!!...
సంతోషానికి ఆసరా కన్నీళ్ళు!!..
కష్టానికి ఓదార్పు కన్నీళ్లు!!...
నిత్యం మనసును
శాంతపరుస్తుంది!!...
శరీరాని సేదతీర్చుతుంది!!...
సకల అంగాలకు సానుకూలంగా
స్పందించే కన్నీళ్లు...
మనసుకు మరింతదగ్గర!!...
మనసుకలత చెందినప్పుడు
దుఃఖాన్ని స్రవిస్తుంది!!...
భరించలేనిబాధను
కన్నీళ్ళద్వారా
వెలిబుచ్చుతుంది!!...
లోలోన కొట్టుమిట్టాడుచున్న
మనసును చుట్టేసుకొని
ఉంటాయి కన్నీళ్లు!!...
మసలే కన్నీటి సెగలై
ఉబికివస్తాయి...
దీనిలోతు.. తెలియని
ఓ పాతాళ గంగ!!...
నిత్యం ఏదో రకంగా
దుఃఖాన్నిమోస్తున్న కళ్ళు..
గొప్పదార్శనికురాలు కళ్ళు...
సమస్త ప్రపంచాన్ని దర్శిస్తాయి!!..
అంతరంగానీ తడుముతుంటాయి!!
ఇదో రకమైన జ్ఞానేంద్రియం!!..
అన్ని ఇంద్రియాలకంటే కళ్ళే గొప్పవి!!
అన్నీటికీ తోడై...చూపై నడిపిస్తాయి!!..
ప్రతిక్షణం..ఎన్నెన్నో దృశ్యాలను
తనలో ఇమిడ్చుకుంటాయి!!..
చైతన్యమై జ్వలిస్తాయి!!..
దశా నిర్దేశం చేస్తాయి!!..
ఇదొక దృశ్య కావ్యం!!..
అప్పుడప్పుడు..వ్యక్తి వికాస
జ్ఞాననేత్రాల్లా తెరుచుకుంటాయి!!..
అంబటి నారాయణ
నిర్మల్
9849326801
13-9-2020