Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎందుకో!!??
లోలోపలనే
వణుకు పుడుతుంది...
ఎందుకో!!??
క్షణంక్షణం
భయం భయం!!...
అనుమానం చుట్టేసి
ధైర్యాన్ని చంపేస్తుంది...
ఇది కఠిన లోకం..
కఠినంగా శిక్షిస్తుందేమో!!??
చేయని తప్పులకు శిక్షలు వేస్తారేమో!!??
కఠినంగా శాసనాన్ని అమలుచేస్తారేమో!!??
అందుకే..
హృదయం రోదిస్తుంది..
నిలువెల్లా కంపనం పుడుతుంది...
ఏదో తెలియని అధికారంతో
అహంకారంతో ఏదో చేస్తారని!!...
అందుకే..భయం..భయం!!
ఆదుకునే వారులేక
ఆదరణ చూపేవారు రాక
ఎగిరి పోవాలని దూరంగా...
గగానానికి!!..
మళ్లీ తిరిగిరాని లోకానికి!!...
ఈలోకం కఠినంగా శిక్షిస్తే...
ఆలోకం ఆప్యాయంగా
పిలుచుకుంటుంది....
ప్రేమతో గుండెలకు
హత్తుకుంటుంది...
అందుకే తెగించి
ఆత్మ హత్యలు
చేసుకుంటారు...
లోకంపోకడ ఎవరికీ...
అర్థం కాదు!!
ఎప్పుడు ఏ విధంగా..
మారుతుందో తెలియదు!!..
ఆలోకంకు దారిచూపేలా
ఈలోకం సర్వవిధాల
సహకరించేలా కృషి చేస్తుంది!!...
ఈ దుస్థితికి కారణం
నేటి లోకమే!!...
దిగజార్చి..దీనస్థితికి
చేర్చుతుంది!!...
జీవితానికి ముగింపు
గీతం వినిపిస్తుంది!!...
నీతికి పాతరేసి..
అవినీతికి ఆసరాయై..
కొందరి ఆత్మహత్యకు
మార్గాన్ని చూపుతోంది!!...
ఊరడించే మాటలులేవు..
అన్నీఊపిరి తీసే మాటలే!!...
సంఘటిత శక్తిని తీసుకొని
సంకల్పబలాన్ని లాగేస్తారు...
అందుకే..
దీనత్వంతో..హీనత్వంతో
దిగులుతో ఆత్మహత్య
చేసుకుంటారు!!...
ఇది ఘోరమైన తప్పు!!..
మనిషి మనసు ఎంతో గొప్పది...
ఖగోళమంత విశాలమైనది..
భూగోళంమంత వెడల్పైనది..
అలాంటి మనసును
ఇరుకుగదిలో బంధించి
నిరాశ నిస్పృహలోకి
నెట్టేస్తున్నాం!!...
ఆలోచనల్ని..ఆశల్ని
నరికేస్తున్నాం!!..
ఇరుకును భరించలేక
ఆత్మహత్యలకు దారితీస్తుంది!!
శాంతి..ప్రశాంతతను తోసేసి
క్రూరంగా ఆత్మను చంపేస్తుంది!!..
వద్దు..వద్దు ఆత్మహత్య..!!
ఆత్మహత్య మహాపాతకమని
గ్రహించు!!...
అంబటి నారాయణ
నిర్మల్
9849326801
14-9-2020