Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా!!
ఓ భయంకర భూతంలా
అందరినీ బాధిస్తోంది...
అందరినీ రెచ్చకొడుతోంది..
పూటకో కొత్తజన్మ ఎత్తుతోంది..
రోజురోజుకూ ఆయుష్షు
పెంచుకుంటోంది..
సరికొత్తచరిత్రను
లిఖించుకుంటోంది...
ఎక్కడో పుట్టి..
ప్రపంచాన్ని ఏలుతోంది!!...
మనుషుల్లో..
భయాన్ని పుట్టించి
గుండెబరువును
పెంచుతోంది!!..
ప్రతిఇంటితలుపూ
తడుతోంది!!..
ప్రతి ఊరికి చుట్టమై
మనలో..మనమధ్యనే
ఉండిపోతోంది!!..
దీని మస్తిష్కంలో
ఎన్నెన్ని విషవలయాలో!!??..
ఇంకెంతటి తీవ్రత
దాగివున్నదో!!??
ఎందరెందరినో
ఎగరేసుకుపోయింది!!...
ఎవరికీ అర్థంకాని ఆటలాడుతూ
మిడిసిమిడిసి పడుతోంది!!..
ఓ ప్రభంజనంలా మారి
ఊళ్ళుఊళ్లనే కబళించేస్తోంది!!..
ఇది ఓ అఖండ వలయం!!..
అందరినీ చుట్టేస్తోంది!!..
దట్టంగా కమ్ముకుంటోంది!!...
కాలహరణం తప్ప
మనం మూలాల్ని
తెలుసుకోలేదు!!..
నివారణోపాయానికి చేయని ప్రయత్నమంటూ లేదు!!...
మానవసంబంధాలను
మట్టిలో కలిపేస్తోంది!!...
అస్పృశ్యత జాఢ్యాన్ని
పెంచి పోషిస్తోంది!!..
అగుపించని అణువైనా
ఇది అస్తమించేదెప్పుడో!!??..
మానవ అవస్థలు తీరేదెప్పుడో!!??..
ఇదో కంటికి కనిపించని
ఓ భయంకర మానవసునామీ...
ఇదో మొండిఘటం!!....
ఊహకందకుండా
ఊపిరి తీస్తోంది!!...
అదృశ్యమవుతూనే అవనినంతా ఆక్రమించేస్తోంది!!...
ఎన్నెన్నో ఎత్తులు..
పైఎత్తులు వేయగల
మనిషి సైతం..
దీని అంతంలో
విఫలుడవుతున్నాడు!!...
అన్నిదిక్కుల్లో వ్యాపించిన..
కరోనాను కట్టడిచేయలేకున్నాడు!!...
అదరకబెదరక...
కాలానికి ఎదురీదుతూ..
రేపటికొరకు ఆశతో నిరీక్షిస్తూ.. ముందుకుసాగిపోవాలి!!...
ఎప్పటికైనా...
ఆ కరోనాను కర్తవ్యదీక్షతో
అంతం చేసితీరాలి!!..
అంబటినారాయణ
నిర్మల్
9849326801
15-9-2020