Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బి.శశికళ
సీ.ప.
జగమంత యుగమంత సగభాగమంతటా
ఎదయందు ముఖమందు యెగసియుండు
యీజీవి యాజీవి యేజీవి లోనైన
స్ర్తీజాతి లేనట్టి జీవి లేదు
యీచోట యాచోట యేచోటనైనను
చేటు చేశావంటె వేటుపడును
కీడు జేయాలని జూడబోయేవాడు
వెళ్లిపోగలడులే వల్లకాడు
ఆ.వె
పరమ శివుని యందు పార్వతీ సగమేను
బ్రహ్మ ముఖమునలరు భారతాంబ
శ్రీహరి హృదయాన శ్రీలక్ష్మి కొలు వుండు
సతులు లేని పతులు బతుక తరమ!
🙏🏾💐శశికళ.బి