Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-శశికళ.బి
సీ.ప
చదువుల సామ్రాజ్ఞి ముదముగా యిటువచ్చి
చిన్నారి జవరాండ్ర జేర పిలిచె
ముంగురు తుమ్మెదల్ ముఖచంద్ర బింబము
ఉదయించు సూర్యుడే నుదుటిబొట్టు
ఇంద్రధనుసువోలె ఇంపు కన్నులదీరు
కనులుండ వెన్నెలా కాంతితోడ
సంపెంగ అందాలు సొంపైన నాసిక
పగడాల పెదవులా పలకరింపు!
ఆ.వె
చుబుకమందుయమరె జూడ చక్కని చుక్క
పలు వరుసలు ముత్యముల వరుసలు
జుక్కలున్న చీర చక్కని యాకసం
అమ్మవారి రాజహంస నేను!