Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శశికళ.బి
సీ.ప.
తట్ట, బుట్టనుబట్టి మట్టి పనులు జేయ
పొట్ట జేతను బట్టి పట్టణమ్ము
పుట్టు బానిస చేరి నిట్టూర్పు విడిచెను
కట్టుబట్ట కరువు వెట్టివాడు
కనుచూపు మేరలో కానరాని పనులు
కష్టకాలమునందు కంట నీరు
వెతల వలస కూలి బతుకు చితికిపోయె
కుడువ మెతుకు లేక కృంగిపోయె
ఆ. వె
కట్టుబాటు జేసె కనిపించని కరోన
తడబడినయడుగులు కడుపు మంట
నిలువనీడ లేని నేటి వలస కూలి
నిజము సుమ్ము నేటి ప్రజల బాధ !