Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-శశికళ.బి
సీ.ప
కడుపులోనను బిడ్డ పడిలేచు కెరటమై
వెడలుచుండిన యట్టి పడతిపాట్లు
నడిచేటి యాబామ్మ తడబడెయాతాత
ముడుతలు పడినట్టి ముసలిబతుకు
భగభగమండినా భానునీ కిరణాలు
బతుకు భారము గాను చితికి పోయె
చెలమలాయెకనులు చెమటతోడను మేను
చెంత యెవరు లేని చేదునిజము
ఆ.వె
కష్టకాలమందు కరువు దెచ్చె కరోన
నష్టపోయినాడు నరుడు నేడు
భరతమాతబిడ్డ బతుకు భారము నేడు
వెతలతోడ నిండె విశ్వమంత!