Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాలో ఏదో పలికిస్తుంది..!!
నన్ను..ముందుకు నడిపిస్తోంది..!!
కనిపించకుండానే..
నన్ను కదిలిస్తుంది..
నన్ను ఆడిస్తుంది పాడిస్తోంది..!!
నాకు తెలియకుండానే
యేదో శబ్దం వినిపిస్తోంది..!!
ప్రతి కవితకు
ఓ సూత్రదారయి..
ప్రతి ఆలోచనకు.. మనోనేత్రమై..
సమాజ వీధులన్నీ చూపిస్తోంది..!!
ప్రతి శబ్దంలో ...
ఓ నిశ్శబ్ద సిద్దాంతాన్ని
నిత్యం వినిపిస్తోంది..!!
రెచ్చగొట్టే మాటలను
వినిపించి కోరికలను
పుట్టిస్తుంది..!!
ఒక జల పాతంలా ..
నాలో పారుతుంది
తన అస్తిత్వపు కాంతితో..!!
ముందుకు నడిపిస్తోంది..!!
లోయల్ని చూపించి
గొంతెత్తి అరువమంటుంది..!!
లోపల దాగిఉన్న శోకాన్ని
కక్కేయమంటుంది..!!
కనిపించే ఈలోకాన్ని
పరిశీలించ మంటుంది..!!
ఎన్నెన్నో సాలే గూళ్ళు
నిర్మించుకొని ఉన్నాయి..
కుట్ర కుతంత్రం ఈర్ష్య
ఒక్కటై సాలే గూళ్లుగా ఏర్పడై..!!
ఇదొ వింత పద్మ వ్యూహం..!!
నిర్దాక్షిణ్యంగా నమిలేస్తోంది..!!
వలయాన్ని
ఛేదించుడం కష్టం
కొంత కాలమహిమల్ని
తెలుసుకోని ..!!
నడుచుకోవాలి..
కొత్త అలోచనలు
మొలకెత్తాలి..!!
తెలియనిది
ఏదో వెంటాడుతోంది..!!
ఓ కంట కనిపెట్టుకుంటు నడవాలి..!!
ఏదో తెలియని స్పందన కనిపిస్తుంది..!!
కదిలే కాలం మబ్బులు చుట్టేస్తాయి..!!
ఏదో.. తెలియని
అలికిడి ..విన్నప్పుడు
నిలబడి.. ఆగి చూడాలి..!!
మదిలోపలికి దూరి
మలినం చేస్థాయి..
మనసుకు పదును పెడుతూ...
వయసుకు ఉత్సాహంనిస్తూ...
ముందుకు సాగాలి..!!
చైతన్యమై నిలబడాలి..!!
అంబటి నారాయణ
నిర్మల్
9849326801