Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శశికళ.బి
సీ.ప
విరుల తేనియ లాగ వీనుల విందుగా
కడుపులో మాటతో కరిగిపోతి
అపురూపమైనట్టి ఆనాటి నీరూపు
హృదయ కమలమందు కుదురుకొనెను
మెత్తనీ స్పర్శతో హత్తుకున్నావమ్మ
వెచ్చదనమునిచ్చె పిచ్చితల్లి
పాలధారలు పోసి పాటలు పాడావు
పాల బుగ్గ చిదిమి పరవశించి!
ఆ.వె
చదువు సంధ్య జెప్పి చక్కనీ నడతను
నేర్పినావు తల్లి ఓర్పుగాను
కమ్మ దనము కలదు అమ్మ పదమునందు
అద్భుతమ్ము దోచెనమ్మ నాకు!