Authorization
Mon Jan 19, 2015 06:51 pm
--శశికళ.బి
సీ.ప
కడుపులో పాపాయి కాలితో తన్నినా
కనిపించునందాలు కనులలోన
పురిటి నొప్పులతోడ పొగిలి పొగిలి యేడ్చి
పొత్తిళ్ళ పాపతో పొందు సుఖము
అమ్మగా స్థన్యాన్ని అందించునాతల్లి
ఆప్యాయతను జూపునమ్మ మనసు
పక్కలో నిదురించు పసివాడు యేడ్చిన
పక్క శుభ్ర పరచి పలుకరించు!
ఆ. వె
అమ్మ చేతి వంట అత్యంత మధురము
అమ్మ తెలుసుకొనును ఆకలైన
అమ్మ పిలుపులోన అమృతము కలదయ్య
ఆదరించవయ్య అమ్మనెపుడు!