Authorization
Mon Jan 19, 2015 06:51 pm
--శశికళ
సీ.ప
జరిగిన కథ యిది జగతి కథ యిదిర
చవులూర వినుమయ్య శ్రద్ధగాను
పురుషుడు వరుణుడు పుడమి భూదేవి
వర్షాన్ని కురిపించు వరుణ దేవ
పరవశించి పుడమి పంటలనందించు
ఆకలీ దీర్చేటి అమ్మ యీమె
విశ్వాన యిరువురు వెలుగులు విరజిమ్ము
అలరించు చున్నారు అమ్మ నాన్న !
ఆ.వె
అమ్మ లేక మనకు ఆకలే తీరదు
నాన్న లేక నీరు నారు లేదు
చెప్పగలర గుట్టు విప్పగలర మీరు
గొప్పవారు యెవరు చెప్పగలర?