Authorization
Mon Jan 19, 2015 06:51 pm
--శశికళ
సీ.ప
రమ్య కుటీరాన రంగవల్లే అమ్మ
రసరమ్య కావ్యాన్ని రాయగలదు
రైలుబండే నాన్న రహదారి అమ్మరా
వృక్షమే నాన్నైతె వేర్లు అమ్మ
బహుళ అంతస్థున భవనమే నాన్నైతె
ఆ భవన యిటుక అమ్మ గదర
యెగురు గాలి పటము యెత్తైన నాన్నైతె
దారమే అమ్మగా దాన్ని పట్టు!
ఆ.వె
సైకిలెక్కు నపుడు సంసార నౌకేర
గోప్యమిందు లేదు గుర్తు యెరుగు
అమ్మ నాన్నలేర ఆ బండి చక్రాలు
అమ్మ లేని మనకు గమ్యమేది?
🙏🏾శశికళ