Authorization
Mon Jan 19, 2015 06:51 pm
--శశికళ.బి
సీ.ప
పుట్టింట పెరిగావు పొందిగ్గ నీవమ్మ
అత్తింట తిరిగావు అమ్మ గాను
జగతి వెలుగు పంచ జత కట్టినావమ్మ
పతికి హృదయరాణి పడతివమ్మ
పదము పదనిసలు మధురమే మాటలు
మృదువైన దరహాస వదనమమ్మ
చీకటి వెలుగులో చీల్చుకు పోయావు
నీతికి నిలబడ్డ నేటి అమ్మ!
ఆ. వె
మధుర భావములను వదనాన పలికించు
హృదయ బాధలున్న అదమగలవు
దీక్ష తీసుకున్న ధీశాలి నీవమ్మ
స్ఫూర్తినిచ్చు మాతృ మూర్తివమ్మ !