Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీ. ప
సంపత్ కుమారుల సాహితీ పాండితీ
చక్కగా నిలుచును చరిత లోన
శ్రేష్ఠుడైన గురువు శిష్యకోటికి వీరు
స్ఫూర్తి కలుగ జేయు మూర్తి వీరు
ఆదర్శ ప్రాయము ఆతనీ జీవితం
ఆవిష్కరించిరి అద్భుతాలు
వేద విజ్ఞానమ్ము వినిపించారులే
తాదాత్మ్యమును చెందె తమిళ హృదులు
ఆ.వె
కవితలల్లి వీరు కవిగాను వర్ధిల్లు
పుస్తకాలు వ్రాసి పుష్టి కలిగి
పరిఢవిల్ల వలయు ప్రతిభ కలిగి మీరు
పండితాగ్రగణ్య పరమహంస !
పాదాభివందనాలతో.....శశికళ మరియు శిష్య బృందం