Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-- బి. శశికళ
సీ.ప
సాహితీ సౌరభం సంపత్ కుమారుడు
సద్గుణ సంపన్న సార్వభౌమ
వృత్తి గౌరవ మున్న ఉత్తమ గురువులు
నైతికత్వముయున్న హేతువాది
అన్ని శాస్త్రములను ఔపాసనను బట్టి
అలరారు చుండిన ఆంధ్రుడితడు
విశ్వ విజ్ఞానిగా విఖ్యాతి పొందిన
వెలుగులు విరజిమ్ము విజ్ఞుడితడు
ఆ. వె
తీపి జేసె నేడు తెలుగువారి హృదులు
తెలుగు జిలుగు వెలిగి తేజమొంది
శుభము కలుగి వారు శోభిల్లవలయును
పరిమళించు కీర్తి పండితునిగ!