Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-బి.శశికళ,పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం
సీ.ప
సీతరామ చరిత గీత సారము నంత
నైతిక విషయాలు లోతుగాను
వైదిక ధర్మాలు వేదపురాణాలు
ఆధ్యాత్మ విషయాలు అధ్భుతముగను
నన్నయ అనువాదనైపుణ్య పాండితీ
తిక్కన నవరసం తీరుగాను
ఉపనిషద్థర్మాలు ఉపమానములతోడ
విశదీకరించిరీ వివరముగను!
ఆ.వె
భారతాది రచన వీరచరితలను
కోరుకొండవారు సారమంత
తేనెలూరునట్లు తేటతెల్లము జేసె
నేటి అతిథులంత మేటి గాను!