Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-బి.శశికళ,పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం
సీ. ప
ప్రేమ కవిత కాదు పేద కవితలను
రక్త వర్ణ కవిత రాసినాడు
ఆధునిక యుగమునాకళింపును జేసి
అత్యున్నత స్థానమాక్రమించె
అధికార దర్పాన్ని అణచు యత్నమ్మున
ఆధునిక కవిత యవతరించె
ఆ యవ్వ మరణిస్తె ఆ పాపమెవరిది?
పాలక వర్గాన్ని ప్రశ్న వేసె!
ఆ. వె
సొంత రీతి కలిగి గొంతెత్తి యరచెను
అణువణువున కాంతి అతని రచన
నూతన యుగమందు రీతులు జూపించి
నవ్య లోకమునకు నవత జూపె!
సీ. ప
భవితకు దారులు బడభాగ్ని కవితలు
ఆరనీ జ్వాలయే అతని కవిత
సుకుమార కవితలు పెకలించి వేసెను
ఆకతాయి కవిత పీక పిసికె
బాణీలనేకమ్ము భాషలో జూపించి
ఆశయ దారులు వేసి జూపె
శాస్త్ర జగతిలోన వాస్తవాలను జెప్పి
కొత్త చైతన్యము కోరి తెచ్చె !
ఆ.వె
పాత కాలమందు యాతనయొదలెను
కలము వాడెనతడు కత్తి వోలె
వాడుక పదములు వాడెను ధాటిగా
ఈటె వంటి తూట మాటలొదిలె!