Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-బి.శశికళ, పద్మావతివిశ్వవిద్యాలయం
సీ. ప
మంగళ వచనాలు మర్మాలు చెప్పిరి
ముదిగొండ ఆచార్య ముదముగాను
ఆచార్య కసిరెడ్డి అద్భుత వాగ్ధాటి
అపర విజ్ఞానిగ ఆధ్యుడితడు
ధన్యుల జేసెను దావూరి వచనాలు
కృష్ణకుమారి మా తృష్ణ దీర్చె
గడ్డు కాలంలోన దొడ్లకౌసల్యమ్మ
విజ్ఞాన నిలయము వెలిగెనేడు!
ఆ.వె
ఉపకులపతి మమ్ము ఉన్ముఖులను జేసి
నిర్వహించువారు నేర్పు తోడ
మస్తనయ్య గారి విస్తృత బోధలు
తెలుగు జిలుగు వెలుగు తేజరిల్లె!