Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సలీమా
9490099083
ఆకాశం ఎర్రని తారలతో
అరుణారుణమై మెరిసిపోతుంది
ఓ చైతన్య పతాకలా
మన వీరుల త్యాగాలను
మేఘమై గర్జిస్తుంది
భూమి కోసం భుక్తి కోసం
వెట్టిచాకిరి విముక్తి కోసం
హలం పట్టిన చేతితో
బందూకు పట్టిన రైతన్నల
వీర గాధలను ఆలపిస్తుంది
రాజాకార్ల దాష్టికాలకు
నిజాం నవాబు ఆగడాలకు
దొరల దౌర్జనాలకు
బలైపోయిన సమరయోధల
స్వరంతో శృతి కలిపి పాడుతుంది
ఆనాటి దోపిడీ పీడనను
బానిస బతుకుల
ఆకలి మంటల ఆర్తనాధాలను
నేటికీ సాగుతున్న అవే ఆగడాలను
పదే పదే వినిపిస్తుంది
ఆనాటి మీ తెగువకు మేమే
మిగిలివున్న సజీవ సాక్ష్యాలం
మీరెత్తిన ఎర్రని జెండకు వారసులం
మీ కలలను నిజం చేసేందుకు
మీరు చేరిన ఆ నింగి సాక్షిగా
ఐక్యమై కదులుతాం...