Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శరత్ సుదర్శి
73860 46936
వీర తెలంగాణ రైతాంగ
సాయుధ పోరాటం మాకు ఉత్తేజం
రజాకారులను తరిమికొట్టిన
కమ్యూనిస్టు దళం
అసువులు బాసిన వీరుల
త్యాగం మాకు స్ఫూర్తిదాయకం
బందూకు పట్టిన నారీ లోకం
వీరనారి ఐలమ్మ ఆరుట్ల కమలమ్మ
తుపాకి పట్టిన మల్లు స్వరాజ్యం
మీ ధైర్య సాహసాలు అజరామరం
వృధాపోదు ఏనాటికీ మీ త్యాగం
పోరు బాటలో నడిపిన
మన కృష్ణమాచార్యుల అక్షరం
ఉత్తేజ పరిచిన కాళోజీ కలం
బుర్రకథలతో చైతన్య పరిచిన
మన మోటూరు ఉదయం
ఆ యోధులు సాధించిన ఫలితం
నేడు భూస్వాములకే పరిమితం
దోపిడీదారులకే కలిసొచ్చే
నేటి రెవెన్యూ చట్టం
తప్పదు మరో విప్లవ పోరాటం
సెంటిమెంటుతో మన
నోరు మూయించేందుకు
పాలకుల మాయాజాలం
దోపిడీ విముక్తికి ఏనాటికైనా
ఎర్రజెండే శాస్త్రీయ మార్గం
అదే మార్స్క్ చూపిన
సోషలిస్టు సిద్ధాంతం