Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పుడిప్పుడే ...
గుర్తొస్తున్నాయి..!!
చూసిన కళ్ళు.. ఎప్పటికి
మోసం చేయవు...
ఇమిడించుకున్న మనసు
ఎప్పటికి మరిచిపోదు..!!
కాస్త ..వ్యవధి తీసుకొని
గుర్తు చేపిస్తున్నాయి..
దుర్బర.. జీవన విధానాలు
తడిమిచూసుకుంటే..!!
వర్తమానంలో మనమే
గతాన్ని తవ్వితే...
యథార్తము కనబడుతోంది..!!
విన్న చవిలోని శబ్దం
కన్నకలల్లోని నిజం
గుర్తొస్తోన్నాయి..!!
తగిలిన దెబ్బలు
రాలిన చమట చుక్కలు
సహజంగా జరిగిన గాదలెన్నో..!!
ఆగాలి ఇప్పటికి
స్పర్శిస్తానే ఉంది...
ఎంత దూరాని
అందుకున్నాం..!!
ఎన్ని తీరాలను దాటినాం..!!
బాధ కలిగినప్పుడల్లా
ఎక్కడెక్కడో కన్నీళ్లు
ఒలకబోసుకున్నాం..!!
మౌనంతో గాయాలను
అనుభవించినాం...
బతుకు బండిని ఈడ్చి
భుజాలు కాయలు కాసినవి
ప్రకృతి పలక మీద అక్షరాలు
దిద్దుకున్నాకాలం..!!
ప్రకృతి వడిలోనే ఆడుకున్నాం...
ఆశగా నాకళ్ళు
ఎక్కడెక్కడో చూశాయి..
స్వేచ్చగా ఆకాశంలో ఎగిరే
పక్షులను చూసి..
నాకునాకే ఈర్ష్య పుట్టేది..!!
మనసు చిన్నది ఆశపెద్దది
ప్రశ్నలు చిన్నవి జవాబులు పెద్దవి
లేత హృదయంలో లోతైన
ఆలోచనలు పుట్టేవి..!!
ఆధారం లేని చెట్టుకు
అలికిడి ఎక్కువ అన్నట్లు
తలెత్తుకునిలబడ్డ...
ఆకాశాన్ని అందుకోవాలని
ఎగిరీఎగిరి పడుతూ..
అలసిన శరీరంతో
ఓదిగిపోయినా...
ఆశల సంకెళ్ళు తెంపుకొని
ఆకులా రాలిపడ్డ
మొడైన చెట్లమధ్య ఒదిగిన
ఎటూ తేల్చుకోలేని
దైన్యస్థితిలోకి జారిపోయిన...!!
అంబటి నారాయణ
నిర్మల్
9849326801