Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శశికళ.బి
ఆ.వె
కపటమెరుగనట్టి కరుణామయుడితడు
కమ్మనైన నిదుర కాంచ లేడు
కరకు దేలినట్లు కనిపించు పరమాత్మ
ఖాకి వస్త్రమున్న కార్య శీలి!
రహదారి పైన రక్షకభటుడు
ఆ.వె
రక్షకభటుడైన రహదారి రారాజు
ధీరునిగ కరోన బారినుండి
తనకు వీలు పడక దైవంబు పంపిన
భారతీయుడైన వీరుడితడు!
పోలీసు జీవితము
ఆ.వె
కండ్ల నిదుర లేక పెండ్లాము బిడ్డలు
యిండ్ల లోన వారు వండి జూడ
గుండెలదురు నట్లు మెండైన సేవలు
రెండు చేతులెత్తి దండ వేతు!
ఆ.వె
ఆలుబిడ్డలనక పోలీసు రక్షించు
వేళ కాని వేళ కాళ రాత్రి
కాల యముని వలెను ఈల వేతువు నీవు
బాల చంద్రుడిదిగొ పూలమాల!
పోలీసు ఋణము
ఆ.వె
చర్మమొలిచి నేను చెప్పులు గుట్టిన
ఆర్చ లేను ఋణము దీర్చ లేను
కారు జిచ్చు రేపు ఖాకి దుస్తులు నీకు
క్రూర కవచ తీరు మార వలెను!
ధీటైన మొనగాడు పోలీసు
ఆ.వె
కోటిమంది పెట్టు ధీటైన మొనగాడు
గుట్టు రట్టు జేసి మట్టు బెట్టు
కట్టుబట్ట అట్ట వెట్టి దుస్తులు ఖాకి
పట్టు కొనును జగతు జెట్టినైన!
వేటాడు నైజం పోలీసు
ఆ.వె
చీమ చిటుకు మనిన చెమటోడ్చి పరుగెత్తు
చేటు చేయు వారి తాట తీయు
మాటు వేయునితని వేటాడు నైజమ్ము
బాట కొఱకు యెపుడు పాటు పడును!