Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-జి.రాజకుమారి
9490099008
చిరు చిరు నవ్వులూ
చుట్టూ పువ్వులూ
ఎక్కడకు విసిరిందమ్మా
నీ మనసూ..!
ఒక్క దరహాసానికే
నీకంత పరవశమా..!
ఎవరికి కావాలి చెలీ నీ దోస్తానా
ఏమున్నదని నీదగ్గరా?
ధనమా?
దస్కమా?
నగా నట్రా?
మణులా? మాణిక్యాలా?
యివేవీ లేవే
ఏమయిపోలేనేం..? నువ్వు
యిప్పుడు నడిచేదంతా 'నేనే'
నడిపించేదీ 'నేనే'
నటనం 'నేనే'
పఠనవ 'నేనే'
ఈ నగిషీలన్నీ ఉన్నాయా
నీ దగ్గర...?!
లేవే మనీ..!
అక్షర సమాహారమే
అమూల్యం లేదూ ..!
కూర్చుకో మరి.. దరి చేర్చేకో..!
ఆలపించు బృందగానం
ఏ కెరటాన్ని చూడలే
తీరానికి చేరాలని ఎంత పోరాటం
ఆకాశాన్నంటాలని
ఎంతటి ఆరాటమో చూసావు కదా..!
అందుకే ..కావాలి
ఆ.. ఆలాపన
ఆ.. స్నేహం
ఆ..బృందమే
ఆ..గానమే