Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలోచించండి..
ఆలోచిస్తూ ..
చూట్టూ గమనించండి..!!
అంతా గ్రహించండి..!!
ఆలోచనలతోటే
సమస్యలకు అంతం..!!
అనుభవమున్న ఆలోచనలు
జీవిత పూనాదికి మూలం..
అందరికి సమీపంగా
ఉండి ఆలోచించండి..!!
ఊహించనివి
వృద్ధిలోకి వస్తాయి..
అన్నీటినీ వంటపట్టించుకోవాలి...
మానవత్వాన్ని
నిలిపేవిదంగా ఉండాలి..!!
ఆలోచించడం దూరాశకాదు
దూరాలోచన కాదు..!!
కొత్త అనుభవం వస్తుంది..
సహజమైన ఆలోచనగా
సమాజమునకు
శ్రేయస్కారంగా ఉండాలి
ఓ బాధ్యతగా ఆలోచించాలి..!!
కొందరి బరువును
దించే విదంగా ఉండాలి..
అభ్యుదయంగా ఉండాలి..
అంతరాత్మలోంచి రావాలి..
సమీక్షించే ఆలోచనై ఉండాలి..
పరిశీలించే తత్వమైన
ఆలోచనై ఉండాలి...
అత్యున్నత ఆదర్శమైన
ఆరోగ్యకరమైన ఒక ఆలోచననే
కొందరి జీవితాలలో
వెలుగులు నింపుతుంది..!!
ఆర్ద్రతతో ఆలోచించండి..!!
కొందరి బతుకు వెతలను
తీర్చే విదంగా ఉండాలి..
నిస్సహాయకులకు
సహాయ కారునిగా ఉండాలి..
అనేక ప్రశ్నలకు
జవాబు దారిగా ఉండాలి ..
ఆలోచన ఒక మెరుపు..!!
ఆలోచన ఒక వెలుగు..!!
సమీప్యంగా ఉండి...
సమస్యలను తీర్చాలి
ఓ ప్రయత్నంతోనే నడవాలి ..
ఓ ప్రమాణికంగా సాగాలి
కొందరికి మార్గదర్శం కావాలి
మనోనేత్రమై నిలవాలి
కొందరికి ఆలోచనలే ఆయువుపట్టు..!!
కొత్త కాంతులు రావాలి
కొత్త పుంతలు తొక్కించాలి..!!
అసమానతల అడ్డును తొలిగించాలి..!!
అసహజ రీతుల్ని నిర్మూలించాలి..
సహజ నడకను చూపించాలి
ప్రతి ఆలోచన ప్రగతికి దారి కావాలి..!!
అంబటి నారాయణ
నిర్మల్
9849326801