Authorization
Mon Jan 19, 2015 06:51 pm
--శశికళ
సీ.ప
వరుణుడు గురిపించు వర్షాన్ని యవనిపై
హృదయాన పంటలు పృధివి యిచ్చు
జలజల చినుకులు జలమునావిరి జేసి
జక్కగా మేఘుడు జలములిచ్చు
యిక్షురసము వంటి ద్రాక్షాది పండ్లిచ్చి
మోక్షాన్ని పొందును వృక్షజాతి
వెన్న పాలు పెరుగు జున్ను, మీగడ, నెయ్యి
గోక్షీర సంపద గోవులిచ్చు!
ఆ.వె
జన్మ యిచ్చె మనకు జనని దల్లి గదరా
తనువు మనది గాదు తపన వలదు
తనివి దీర నీవు తరియించు తనయుడ
తరువు వోలె తనువు పరులకివ్వు!