Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-- శశికళ.బి
సీ.ప
హృదయకంపనములు యెదలోన బాధలు
యస్త్రాల తోడను యణచవద్దు
పిల్లగాలి వలెను మెల్లగా స్పృశియించు
మల్లె తీగ వలెనుయల్లుకొనును
చేర బిలిచి వా రినాదరించు యెడల
చిరుజల్లు కురిపించి చిగురు తొడుగు
విశ్వమందు ప్రగతి వేల కార్మిక శక్తి
విజయ సోపానాలు వేయగలవు!
ఆ.వె
ఆకలైన వారి అవసరంగమనించు
అధములని దలచక మదమునొదులు
రధము కదల గలదు రహదారి మార్గాన
అంతరములు లేక ఆదరించు!