Authorization
Mon Jan 19, 2015 06:51 pm
--శశికళ.బి
సీ.ప
సంగీత సాహిత్య సామ్రాజ్య నేతయై
జాతీయ గీతాన్ని జాతికిచ్చె
రవీంద్రనాధుడు రాణించె కవిగాను
అధ్యాపవృత్తిలో అలరెనితడు
గౌరవించిరితని ఘనమైన కవిగాను
విశ్వకవిగ పేరు వినుతికెక్కె
జవహరులాలుకి జగతినే జూపెను
మనకీ గురూజీయె మార్గదర్శి!
ఆ.వె
చిన్న తనములోనె చిత్రలేఖకుడయ్యె
కాళిదాసు కవిత కవిగ మార్చె
నాటకాలు వేసి నటునిగ మారెను
గౌరవించెనితని గాంధి తాత!