Authorization
Mon Jan 19, 2015 06:51 pm
--శశికళ.బి
సీ.ప
సంప్రదాయ చరిత సరస్వతమునందు
జానపథ కవిత కానరాదు
మహిళల చదువులు మహిలోన వెలుగులు
విద్యనాపగ జూచె విజ్ఞులంత
నాలుగు వర్ణాల నగుబాటు సంస్కృతి
కాకమ్మ కబురుల కథలు జెప్పె
పంటల దిగుబడి పట్టణాల ప్రగతి
శ్రమ శక్తి తోడనే సాధ్యమవును
ఆ.వె
కర్మ వీరులైన కార్మిక సిబ్బంది
అరమరికలుకూడదవని పైన
మనకు యున్నవిపుడు మానవ హక్కులు
మాట రీతి తెలిసి మసలు కొనుము!