Authorization
Mon Jan 19, 2015 06:51 pm
--శశికళ.బి
సీ.ప
బౌద్ధ మతమునందు సిద్ధాంతములు జెప్పి
భవనాలు గట్టెను అవనియందు
అంధకారము బోవ హిందూ దేశ వెలుగు
మతమును స్థాపించి మాన్యుడయ్యె
సాహితీ సంపద జాతక కథలలో
బాట జూపించు త్రిపీటకములు
చైన యాత్రికులంత చరితను వ్రాసిరి
ధర్మ మార్గము జూపు దమ్మపదము!
ఆ.వె
బ్రహ్మ చర్య దీక్ష బౌద్ధ మతమునందు
పరమ పాతకమ్ము ప్రాణిహింస
అతడు జూపినాడు అష్టాంగ మార్గాన్ని
తత్త్వసారమున్న తపసియితడు!