Authorization
Mon Jan 19, 2015 06:51 pm
--శశికళ.బి
సీ.ప
కోటి వెలుగులతో కూర్మ నాధుడు బుట్టె
అమృతము కోసమే యవతరించె
వాసుకి సర్పము వచ్చెను తాడుగా
తలవైపు నిలిచిరి దనుజులపుడు
మోహన కూర్మము మూపుపై నిలపగా
మర్ధించ సాగెను మందరమ్ము
అజ్ఞాత శక్తిగా అచ్యుతుడణచగా
అమృతము చిలికించె అమరులపుడు!
ఆ.వె
ఆదికూర్మ నాధుడవతరించిన రోజు
అవతరించె లక్ష్మి హరిని చేర
పడతిగాను మారి పంచెనుయమృతము
ముదము కలుగజేసె హృదయలక్ష్మి!